ETV Bharat / city

Nara Lokesh: 'రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ ఓ సూపర్ స్ప్రెడర్ కార్యక్రమం'

పరీక్షల(Exams) రద్దు నిర్ణయాన్ని వెంటనే అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలపాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌(Lokesh) డిమాండ్ చేశారు. లేకుంటే పరీక్షల రద్దు కోసం మరింత ఉద్యమిస్తామని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణ ఓ సూపర్ స్ప్రెడర్ కార్యక్రమమని ఆరోపించారు.

nara lokesh on  exams  conduction during corona time

author img

By

Published : Jun 23, 2021, 12:10 PM IST

రాష్ట్రంలో పరీక్షల(Exams) నిర్వహణ ఓ సూపర్ స్ప్రెడర్ కార్యక్రమం అని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) ఆరోపించారు. పరీక్ష నిర్వహణ వల్ల 80 లక్షలమందికి ముప్పు పొంచి ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం 15 లక్షలమంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకే తెదేపా పరీక్షలు రద్దు చేయాలని పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు.

పరీక్షలు(Exams) రద్దుచేయని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని లోకేశ్‌(Lokesh) అన్నారు. దేశమంతా ఒక దారిలో వెళ్తుంటే అందుకు విరుద్ధంగా జగన్ వైఖరి సరికాదని అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన దృష్ట్యా పరీక్షలు రద్దుచేయాలని డిమాండ్​ చేశారు. పరీక్షల రద్దు నిర్ణయాన్ని వెంటనే అఫిడవిట్ ద్వారా సుప్రీంకు తెలపాలన్నారు.

ఏ విద్యార్థి ప్రాణానికి ముప్పు వాటిల్లినా సీఎం జగన్‌దే బాధ్యత అని లోకేశ్​(Lokesh) అన్నారు. పరీక్షల(Exams) రద్దుపై నిర్ణయం తీసుకోకుంటే మరింత ఉద్యమిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని.. కొవిడ్ మూడో దశ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారని గుర్తు చేశారు. ఈ పరిస్థితిలో 15 లక్షలమంది పిల్లలు బయటకు వస్తే పరిస్థితి ఏంటని నారా లోకేశ్​ నిలదీశారు.

ఉద్యోగ క్యాలెండర్ ఓ ఫేక్ క్యాలెండర్‌ అని రుజువైందిని లోకేశ్‌ అన్నారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పింది జగన్ కాదా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

వచ్చే నెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.