సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో ఏపీని ముక్కలు చేయాలని చూస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. 3 ముక్కలాటకు ఇప్పటికే 64 మంది రాజధాని రైతులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 200 రోజులుగా అన్నదాతలు ఆందోళన చేస్తుంటే తేలిగ్గా తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ఇది విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమని ఉద్ఘాటించారు. 'ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని' అంటూ అమరావతి కోసం ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.
కక్షసాధింపు కోసం అధికార దుర్వినియోగం
కక్ష సాధింపులో భాగంగానే మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేశారని లోకేశ్ ఆరోపించారు. రాజకీయాల్లో మిస్టర్ క్లీన్‌గా ఉన్న ఆయన్ను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. అసమర్థ పాలనను ఎండగడుతూ రవీంద్ర పోరాడుతున్నందునే అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ తన అధికారాన్ని కేవలం కక్ష సాధింపునకు మాత్రమే వినియోగించుకుంటున్నారని విమర్శించారు.
ఇవీ చదవండి..