ETV Bharat / city

వైకాపా ప్రభుత్వ విధానాలతో రోజుకో రైతు ఆత్మహత్య: లోకేశ్ - nara lokesh latest news

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్​ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతుల భవిష్యత్తును అంధకారం చేసేందుకు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని మండిపడ్డారు. రైతు దినోత్సవాన్ని వైఎస్ జ‌యంతికి మార్చుకున్నారని దుయ్యబట్టారు.

nara lokesh
nara lokesh
author img

By

Published : Dec 23, 2020, 10:58 AM IST

  • వ్య‌వ‌సాయ రుణాలు అందించి, కౌలు రైతుల హ‌క్కులు కాపాడేందుకు చ‌ట్టం తెచ్చిన రైతుబంధు చ‌ర‌ణ్‌సింగ్ గారి జ‌యంతిని జాతీయ రైతు దినోత్స‌వంగా జ‌ర‌ప‌డం మన ఆన‌వాయితీ. నాటి పాలకులు రైతుల జీవితాల్లో వెలుగు నింపేందుకు సంస్కరణలు తీసుకొస్తే నేడు రైతుల పాలిట రాబందుగా మారిన @ysjagan..(1/4)

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వైకాపా ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో రోజుకో అన్నదాత ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. కర్షకులకు జాతీయ రైతు దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన... ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చ‌ర‌ణ్‌సింగ్ జ‌యంతిన జరపాల్సిన జాతీయ రైతు దినోత్సవాన్ని వైఎస్ జ‌యంతిన నిర్వహిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

రైతుల భవిష్యత్తును అంధకారం చేసేందుకు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారు. సర్కార్ విధానాలతో రోజుకో అన్నదాత ఆత్మహత్యకి పాల్పడటం ఆవేదనకు గురిచేస్తోంది. క‌ట్టేవి కూల‌గొట్టడం, వీలుకాకుంటే రంగులేయడం, అదీ సాధ్యం కాక‌పోతే స్టిక్కర్లు అంటించ‌డం మాత్రమే ముఖ్యమంత్రికి తెలుసు. ప్రభుత్వ సాయం కోసం పొలాల్లో రైతులు ఎదురుచూస్తుంటే వ్యవసాయ శాఖ మంత్రి రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నారు. కర్షకులకు న్యాయం జరిగేలా పోరాడటానికి నేను ముందు ఉంటాను- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి:

అనపర్తిలో వేడెక్కిన రాజకీయం.. నేతల సవాళ్లతో పోలీసులు అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.