ప్రభుత్వం తెచ్చింది.. వైఎస్సార్ చేయూత పథకం కాదని.. జగన్ చేతివాటం అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని చెప్పి.. తర్వాత మాట మార్చారని విమర్శించారు. పింఛన్లు ఇస్తే ఏడాదికి రూ. 36,000... 5 ఏళ్లకు రూ.1.80 లక్షలు మహిళలకు అందేవని.. అందుకే జగన్ రివర్స్ టెండరింగ్ పెట్టారని లోకేశ్ ఆరోపించారు. 5 ఏళ్ల పాలనలో ఒక్కో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళకు కేవలం రూ.75,000 ఇస్తామని చెప్పి, ఒక లక్షా ఐదు వేలు తగ్గించారని ఆరోపించారు.
ప్రతి ఏటా నష్టం రూ.17,250, 4 ఏళ్లలో రూ.69,000, మొదటి ఏడాది కోత రూ.36000 మొత్తంగా ఒక్కో మహిళకు జగన్ రెడ్డి చేతి వాటం, లక్షా ఐదు వేల రూపాయలు అని లోకేశ్ ఆరోపించారు. తెదేపా కోటి మందికి పసుపు కుంకుమ కింద ఆర్థిక సాయం అందిస్తే... వైకాపా ప్రభుత్వం ఆ లబ్ధిదారులను 23 లక్షలకు తగ్గించి వారిలో విభేదాలు సృష్టిస్తోందని ఆక్షేపించారు. మిగిలిన వారు పేదలు కాదా అని నిలదీశారు. చాలా మంది పేద మహిళలకు ఆధార్ లో వయసు తప్పుగా నమోదు అయ్యిందన్న లోకేశ్... వారందరికీ వయసు సరిచేసుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: