రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావడం చేతగాని జగన్ రెడ్డి, చంద్రబాబు కష్టాన్ని కొట్టేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. కంపెనీల పేర్ల పక్కన ఎంత పెద్దగా జగన్ రెడ్డి ఫోటోలు వేసినా, అందులో చంద్రబాబు రాష్ట్రానికి తెచ్చిన సంస్థలు, యువతకు కల్పించిన ఉపాధి కష్టమే కనిపిస్తుందనే విషయం ఎప్పుడు అర్థమవుతుందో అంటూ వివిధ చిత్రాలను తన ట్విట్టర్‌కు జతచేశారు. తుగ్లక్ పరిపాలన చూసి కంపెనీలన్నీ పారిపోతున్నాయని ధ్వజమెత్తారు. 18 నెలల పాలనలో కూల్చివేతలు, కక్ష సాధింపులు, జే ట్యాక్స్ తప్ప జగన్ సాధించింది శూన్యమని దుయ్యబట్టారు.
చంద్రబాబు కష్టాన్ని కొట్టేసేందుకు విశ్వప్రయత్నాలు: నారా లోకేశ్ - తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
సీఎం జగన్‌పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తుగ్లక్ పరిపాలన చూసి కంపెనీలన్నీ పారిపోతున్నాయని లోకేశ్ మండిపడ్డారు.