ETV Bharat / city

కరోనా విస్తరిస్తుంటే.. పరీక్షల నిర్వహణ సరికాదు: నారా లోకేశ్ - lokesh on exams news

పదో తరగతి పరీక్షలు రద్దు చేసి.. ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని నారా లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతంగా విస్తరిస్తున్నా.. పరీక్షలు నిర్వహించటం సరికాదని హితువు పలికారు.

nara lokesh
నారా లోకేశ్
author img

By

Published : Apr 20, 2021, 12:37 PM IST

విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడే హ‌క్కు వైకాపా ప్రభుత్వానికి లేదని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. విద్యా సంస్థల్లో కొవిడ్ తీవ్రత అధ్యయనానికి.. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. టీఎన్ ఎస్ఎఫ్‌, విద్యావేత్తలు, న్యాయ‌నిపుణులతో కూడిన ఈ బృందం కొవిడ్ ఆందోళన పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని వివరించారు. టాస్క్ ఫోర్స్ బృందంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణ‌వ్‌గోపాల్, తెలుగు యువత నాయకుడు కిలారు నాగశ్రవణ్, న్యాయవాది వెంకటేశ్, విద్యావేత్తలు ఉన్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.

"విద్యార్థుల పాలిట విష‌మ‌ంగా మారనున్న పరీక్షలు" అనే అంశంపై ఆన్​లైన్​లో.. విద్యార్ధి సంఘాలు, విద్యావేత్తలు, న్యాయనిపుణులతో లోకేశ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. ప్రభుత్వం విద్యార్ధుల ప్రాణాలకు పరీక్ష పెడుతోందని ధ్వజమెత్తారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేసి ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కరోనా కోరల్లో చిక్కుకున్నరాష్ట్రంలో.. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేసి తీరాలన్నారు.

కరోనా దెబ్బకు ప్రజలు విలవిలలాడుతుంటే.. సక్రమ వైద్యం అందిచే స్థితిలో సర్కారు లేదని దుయ్యబట్టారు. దేశం మొత్తం కొవిడ్ పాజిటివ్ రేటుతో పోల్చితే.. మన రాష్ట్రంలో 12.5శాతం అధికంగా ఉందన్నారు. నెల‌రోజుల్లో 24 రెట్లు అధికంగా యాక్టివ్ కేసులు పెరిగిన పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ మంచిది కాదని అని హితవు పలికారు.

ఇదీ చదవండి: 1 నుంచి 9వ తరగతి వరకు సెలవులు.. పది, ఇంటర్‌ పరీక్షలు యథాతథం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.