తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలోని మహేశ్వరం వైద్య కళాశాల.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి వెయ్యి పీపీఈ కిట్లు, వెయ్యి ఎన్-95 మాస్క్‌లను అందజేసింది. ఆసుపత్రి డైరెక్టర్, సినీ నటుడు బాలకృష్ణ వాటిని స్వీకరించారు. మహేశ్వరం వైద్య కళాశాల వైద్య సేవలే కాకుండా సామాజికంగా మంచి కార్యక్రమాలు చేస్తుండటం అభినందనీయమని బాలకృష్ణ ప్రశంసించారు.
కరోనా మహమ్మారిపై పోరులో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బాలకృష్ణ కోరారు. ఈ పోరులో ప్రభుత్వాలు కూడా బాధ్యతగా పని చేయాలన్నారు. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్లాస్మా దానం చేసి వైరస్ సోకిన వారి ప్రాణాలను కాపాడాలని బాలయ్య విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: