రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు చూస్తే బాధేస్తోందని నందమూరి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడేళ్ల నుంచి చూస్తున్నాం.. చాలా బాధగా ఉందని అన్నారు. తమ కుటుంబం జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టమని నందమూరి రామకృష్ణ హెచ్చరించారు. ఇలాంటి పరిణామం ఏ కుటుంబానికి జరగకూడదని వాపోయారు. ద్వారంపూడి, కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు హద్దులు మీరి ప్రవర్తించారని రామకృష్ణ హెచ్చరించారు. వ్యక్తిగత విషయాల జోలికి రావద్దని హెచ్చరించారు. సీతమ్మను చెరపట్టిన రావణాసురిడి చరిత్ర ఏమైందో అందరికీ తెలుసని..అదే గతి మీకూ పడుతుందని రామకృష్ణ అన్నారు.
రాజకీయ పరిణామాలు చూస్తే బాధేస్తోంది. ద్వారంపూడి, కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు హద్దులు మీరారు. రాజకీయంగా ఉంటే... రాజకీయంగానే చూసుకోవాలి. వ్యక్తిగత విషయాల జోలికి రావద్దు. మేం కూడా గాజులు తొడుక్కుని కూర్చోలేదు. మా నాన్నగారు, తెదేపా క్రమశిక్షణ నేర్పింది. మా సహనాన్ని పరీక్షించొద్దు. మీరు హద్దు మీరారు.. మేమూ హద్దు మీరుతాం. - నందమూరి రామకృష్ణ
చంద్రబాబు అలా బాధ పడుతుంటే చూడలేకపోయామని లోకేశ్వరి ఆవేదన చెందారు.
ఇవీచదవండి.