Health University: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును తొలగించడాన్ని నందమూరి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. అన్ని వైద్య కళాశాలలు ఒకే పాలసీతో నడవాలనే భావనతో 1986లో ఆరోగ్య వర్సిటీని ఎన్టీఆర్ స్థాపించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ పేరును తొలగించడమంటే యావత్ తెలుగు జాతిని అవమానించినట్లేనని ఆక్షేపించారు.
అన్ని పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు చెందిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు అన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్ పేరు మార్చడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య విశ్వవిద్యాలయాన్ని ఎన్టీఆర్ పేరుమీదనే కొనసాగించాలని నందమూరి రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: