హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీఎం జగన్, సీఎస్ నీలం సాహ్నీకు లేఖలు రాశారు. కొత్త జిల్లాల ఏర్పాటులో హిందూపురం పట్టణాన్ని.. జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని లేఖలో బాలకృష్ణ కోరారు. హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత జిల్లా కేంద్రం అనంతపురం హిందూపురం నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉందని గుర్తు చేశారు.
హిందూపురం నియోజకవర్గం మాల్గురులో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని మరో లేఖలో బాలకృష్ణ కోరారు. మాల్గురు గ్రామంలో వైద్యకళాశాలకు సరిపడా భూమి అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు. మాల్గురులో వైద్య కళాశాల ఏర్పాటు రాయలసీమ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ విషయంపై సీఎం, సీఎస్‌లతో పాటు ఉపముఖ్యమంత్రి ఆళ్ల నానికి కూడా బాలకృష్ణ లేఖ రాశారు.
ఇదీ చదవండి : ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్