ETV Bharat / city

Basavatarakam cancer hospital: బసవతారకం ఆస్పత్రిలో మెడికల్ రికార్డ్స్ నూతన​ విభాగం ప్రారంభం

హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని బసవతారకం క్యాన్సర్​ ఆస్పత్రిని.. ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ సందర్శించారు. క్యాన్సర్​ రోగుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్​ రికార్డ్స్​ నూతన విభాగాన్ని ఆయన ప్రారంభించారు.

Basavatarakam cancer hospital
నందమూరి బాలకృష్ణ
author img

By

Published : Aug 28, 2021, 7:12 PM IST

క్యాన్సర్ రోగుల వైద్య నివేదికలను భద్రపరిచేందుకు వీలుగా హైదరాబాద్​లోని బసవతారకం ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ రికార్డ్స్ విభాగాన్ని.. ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఇప్పటికే రోగుల రికార్డులను భద్రపరిచేందుకు మెడికల్ రికార్డ్స్ విభాగం అందుబాటులో ఉండగా.. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా అదనపు సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.

"ఒక్కో క్యాన్సర్ రోగి.. చికిత్స కోసం ఐదు నుంచి ఏడు సంవత్సరాల పాటు ఆస్పత్రికి రావాల్సి ఉంటుంది. వారికి చేసిన పరీక్షలు, చికిత్స వివరాలను ఎప్పటికప్పుడు భద్రపరచటం.. అవసరమైన సమయంలో తిరిగి అందించటమే ఈ సదుపాయం ముఖ్య ఉద్దేశం. ఫలితంగా క్యాన్సర్ రోగుల చికిత్సలో మరింత వేగం పుంజుకుంటుంది. రికార్డుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు" - నందమూరి బాలకృష్ణ, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి ఛైర్మన్

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు జేఎస్ఆర్ ప్రసాద్, ఆస్పత్రి సీఈవో డాక్టర్ ఆర్వీ ప్రభాకర్​ రావు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టీఎస్ రావు, అసోసియేట్ డైరెక్టర్ కల్పనా రఘనాథ్ సహా పలువురు వైద్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

Rains: రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.