వైకాపా ప్రభుత్వంపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలోనే ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 లక్షలకు పైగా రేషన్ కార్డులు తొలగించారని, 7 లక్షల పెన్షన్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ సోదాలను భూతద్దంలో చూపి తెదేపా మీద దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వంలో మంజూరు చేసిన రుణాలను సైతం అందించలేని రీతిలో జగన్ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. అమ్మఒడి పథకం అమలులోనూ అనేక విధాలుగా మాట తప్పారని ఆరోపించారు.
ఇదీ చదవండి: