తెలంగాణలోని సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ సమీపంలో కింద మూసీ నదికి అడ్డుగా నాగార్జునసాగర్ ఎడమ కాలువను నిర్మించారు. ప్రస్తుతం నిండుగా ప్రవహిస్తున్న సాగర్ ఎడమ కాలువ, భారీ వరదలతో దిగువన కృష్ట నదిలో కలిసేందుకు బిరబిరా పరుగులు తీస్తున్న మూసీ నది కనువిందు చేస్తోంది. పైనుంచి సాగర్ నీరు, కింది నుంచి మూసీ నది ప్రవహిస్తూ.. నాటి ఇంజనీర్ల నైపుణ్యాన్ని గుర్తుకు తెస్తున్నాయి.
పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్న మూసీ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వస్తున్న వరదలతో గేట్లు ఎత్తేశారు. ఈ ప్రభావంతో మూసీ నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉంది. ఒకవైపు నేలను పరుచుకున్నట్లు విశాలంగా ప్రవహిస్తున్న మూసీ నీరు, నిండుకుండను తలపిస్తున్న సాగర్ ఎడమ కాలువ నీరు చూపరులను ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి: రకుల్‌ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో హైదరాబాద్‌కు లింకులు: సంపత్‌కుమార్