ETV Bharat / city

కార్పొరేట్​ సామాజిక బాధ్యత.. ముత్తూట్​ వివాహ కానుక - muthoot finance offer finance support

కార్పొరేట్​ సామాజిక బాధ్యత కింద.. 'ముత్తూట్​ వివాహ కానుక'ను అందిస్తున్నట్లు.. ముత్తూట్​ ఫైనాన్స్​ ఎండీ జార్జ్​ అలెగ్జాండర్​ తెలిపారు. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఈ పథకాన్ని అమలుచేసినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాదికి తొమ్మిది మంది బాలికలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు.

ముత్తూట్​ వివాహ కానుక
ముత్తూట్​ వివాహ కానుక
author img

By

Published : Aug 14, 2021, 9:12 PM IST

కార్పొరేట్​ సామాజిక బాధ్యత- ముత్తూట్​ వివాహ కానుక

తండ్రి లేని కుమార్తెల పెళ్లి ఖర్చులకు అండగా నిలిచేందుకు ముత్తూట్ ఫైనాన్స్ ముందుకొచ్చింది. వితంతువులైన తల్లులు.. ఆర్థిక అవరోధాలు అధిగమించేందుకు, వారి కుమార్తెల వివాహ అవసరాలు తీర్చేందుకు ముత్తూట్ ఎం జార్జ్ ఫౌండేషన్.. 'ముత్తూట్ వివాహ కానుక'ను అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లక్డీకపూల్​లోని ఓ ప్రైవేట్​ హోటల్​లో నిర్వహించారు. ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ జార్జ్ అలెగ్జాండర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డిలు హాజరయ్యారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద.. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని, నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముత్తూట్​ ఎం జార్జ్​ ఫౌండేషన్​ ఈ పథకాన్ని ప్రారంభించిందని.. సంస్థ ఎండీ జార్జ్​ అలెగ్జాండర్ తెలిపారు. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడులో అమలు చేసిన ఈ పథకాన్ని హైదరాబాద్​లోనూ అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరానికి తొమ్మిది మంది బాలికలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు. వచ్చే ఏడాది 20 మందికి లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Atchanna: 'ప్రభుత్వం చేసిన రూ. 2 లక్షల కోట్ల అప్పులు ఏమయ్యాయి?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.