ETV Bharat / city

మిగిలిన పురపాలికలకు త్వరలో ఎన్నికలు - ఏపీ తాజా వార్తలు

రాష్ట్రంలోని 11 పురపాలక, నగర పంచాయతీల్లో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొంది వివిధ కారణాలతో సభ్యులు మృతి చెందిన 8 పురపాలక, నగర పంచాయతీల్లోని పలు వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

elections
elections
author img

By

Published : Aug 10, 2021, 8:20 AM IST

రాష్ట్రంలోని 11 పురపాలక, నగర పంచాయతీల్లో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొంది వివిధ కారణాలతో సభ్యులు మృతి చెందిన 8 పురపాలక, నగర పంచాయతీల్లోని పలు వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా సవరించిన ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని పురపాలకశాఖను ఎన్నికల సంఘం కమిషనరు సోమవారం ఆదేశించారు. ఇటీవల రాష్ట్రంలోని 75 పురపాలక, నగర పంచాయతీలు, 12 నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు. కోర్టు వివాదాలు, ఇతర కారణాలతో నిర్వహించలేని చోట్ల ఇప్పుడు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు కమిషనరు నీలం సాహ్ని ఇటీవల పురపాలకశాఖ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఎన్నికలు నిర్వహించే పురపాలిక, నగర పంచాయతీలు

ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దర్శి, కుప్పం, బేతంచర్ల, కమలాపురం, పెనుకొండ.

ఇదీ చదవండి: అమలులో లోపాలే జీఎస్టీకి శాపాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.