Multiplex movie tickets hyderabad: తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో సినిమా టికెట్ ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే.. కరోనా విజృంభణ దృష్ట్యా ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి పెద్ద సినిమాలు వాయిదా పడడంతో.. సగటు ప్రేక్షకుడు చిన్న సినిమాలకు ఎక్కువ మొత్తంలో వెచ్చించి, టికెట్ కొనే పరిస్థితి లేదు. అందువల్ల టికెట్ ధరల విషయంలో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు వెనకడుగు వేశాయి.
సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మల్టీప్లెక్స్‌లలో ధరలు రూ.300 నుంచి రూ.350 చేరుకున్నాయి. అయితే.. థియేటర్ల యాజమాన్యం తాజా నిర్ణయంతో మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధరలు తగ్గించాయి. తాజా ధరల ప్రకారం.. రూ.200, రూ.175, రూ.150కి తగ్గించాయి.
ఇప్పటికే సంక్రాంతి రేస్‌లో ఉన్న బంగార్రాజు సినిమా సహా పలు చిన్న సినిమాలకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ఈ నిర్ణయంతో.. ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: Kisan Sammelan in vijayawada: సేంద్రియ సాగుకోసం.. ప్రోత్సాహక సంస్థ ఏర్పాటు చేయాలి: మిజోరాం గవర్నర్ హరిబాబు