తెలుగు భాషకు ప్రాధాన్యమిచ్చేలా ఏపీ ప్రభుత్వానికి సూచించాలని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు, తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్రాన్ని కోరారు. రాజ్యసభ జీరో అవర్‌లో మాతృభాషపై ఇద్దరు నేతలు మాట్లాడారు. తెలుగుభాషపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించేలా తగు ఆదేశాలివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అవసరమైతే రాష్ట్రం తీసుకొచ్చిన జీవోను సవరించేలా కేంద్రం ఆదేశాలివ్వాలని కనకమేడల విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: