కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలు నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కేఆర్‌ఎంబీని నోటిఫై చేయాలని కోరారు.
స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు..
'నిన్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశాం. రఘురామపై అనర్హత వేటు వేయాలని మరోసారి కోరాం. సీఎం, పార్టీ నేతలపై రఘురామ వ్యాఖ్యలను వివరించాం. రఘురామపై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరాం. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే పార్లమెంటు వేదికగా నిరసన తెలుపుతాం. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు ఉంది. ఏడాది గడుస్తున్నా అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోలేదు. సుప్రీం తీర్పు ప్రకారం అనర్హత పిటిషన్‌పై నిర్ణయం ఆలస్యం చేయకూడదు."-ఎంపీ విజయసాయి రెడ్డి
ఇదీ చదవండి: