ETV Bharat / city

మీరు గెలిపించండి... కొట్లాడైనా సమస్యలు పరిష్కరిస్తా: రేవంత్ - hyderabad civic polls

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

mp-revanth-reddy
mp-revanth-reddy
author img

By

Published : Nov 27, 2020, 9:11 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజుల రామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్ డివిజన్​లలో రేవంత్ రెడ్డి... ప్రచారం నిర్వహించారు.

డివిజన్లలోని ప్రధాన సమస్యలు పరిష్కారం కావాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కనీసం 25 నుంచి 30 మంది కార్పొరేటర్లను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఏడేళ్లలో రూ. 15 లక్షల కోట్లు కేసీఆర్ ఖర్చుపెట్టిండు. మీరే ఆలోచన చేయాలే... పేదోళ్లకు ఏమోచ్చిందో! నాకు 30 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లను ఇవ్వండి. అద్భుతాలు చేసి చూపెడతా. ప్రభుత్వం మెడలు వంచి పనిచేయిస్తా. మీ కష్టాల్లో అండగా ఉండే బాధ్యత నాది.

--- ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి

ఇదీ చదవండి: రెండు వారాల్లో 2 వాయుగుండాలు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.