ETV Bharat / city

కక్ష సాధించేందుకే అచ్చెన్నపై కేసులు: తెదేపా నేతలు - ప్రభుత్వంపై మండిపడ్డ ఎంపీ రామ్మోహన్ నాయుడు

అచ్చెన్నాయుడిపై కేసులు కక్షసాధింపు చర్యలో భాగమేనని... అనిశా వ్యవస్థను సీఎం జగన్‌ దుర్వినియోగం చేస్తున్నారని తెదేపా నేతలు మండిపడ్డారు. అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు పలువురు తెదేపా నేతలు గుంటూరు జీజీహెచ్​కు వెళ్లారు. అచ్చెన్నను కలిసేందుకు అధికారులు విముఖత చూపటంతో... ఆసుపత్రి వర్గాలతో సమావేశమై ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

mp rammohan naidu fires on government in achennaidu issue
అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు గుంటూరు జీజీహెచ్​కు వెళ్లిన తెదేపా నేతలు
author img

By

Published : Jun 30, 2020, 4:39 PM IST

అచ్చెన్న అరెస్టును ఖండిస్తూ ప్రభుత్వంపై మండిపడ్డ ఎంపీ రామ్మోహన్ నాయుడు

అచ్చెన్నాయుడుని ఎలాగైనా జైలులో పెట్టాలని జగన్ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి గుంటూరు జీజీహెచ్​కు వెళ్లిన ఆయన... ఆసుపత్రి అధికారులను కలిసి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడుకు అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి అధికారులకు వినతిపత్రం అందజేశారు.

అచ్చెన్నాయుడిపై కేసులు కక్షసాధింపు చర్యలో భాగమేనని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించినా...ఆస్పత్రి సూపరింటెండెంట్ సంతకం లేకుండా, కిందిస్థాయి అధికారుల పేరిట నివేదిక పంపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అచ్చెన్నాయుడిని ఎలాగైనా జైలులో పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

శస్త్ర చికిత్స చేయించుకున్న వ్యక్తిని వందల కిలోమీటర్లు తీసుకువచ్చారని... న్యాయమూర్తి చెబితే గాని ఆసుపత్రికి తీసుకెళ్లలేదని మండిపడ్డారు. ఆసుపత్రిలో ఉన్న వ్యక్తిని అర్థరాత్రి సమయంలో డిశ్చార్జి చేసేందుకు యత్నించటాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ కుట్రలకు భయపడేది లేదని.. చట్టపరంగా పోరాడతామని ఎంపీ స్పష్టం చేశారు.

ఎర్రన్నాయుడు సంతకం చేశారు కాబట్టే ఆ కుటుంబంపై కక్ష

అచ్చెన్న అరెస్టును ఖండిస్తూ ప్రభుత్వంపై మండిపడ్డ దేవినేని ఉమా

ఒకప్పుడు సీఎం జగన్​పై అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఎర్రన్నాయుడు సంతకం చేశారు కాబట్టే ఆ కుటుంబంపై కక్ష సాధిస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడిపై కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు. అవినీతి జరిగినట్లు ఆధారాలు లేకపోయినా కేసులు పెట్టారని విమర్శించారు.

అవినీతి బురదలో ఉన్న వైకాపా ప్రభుత్వం.. మా పార్టీ నాయకుడిపై బురద చల్లుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని దేవినేని హెచ్చరించారు.

కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని... వ్యవస్థలను సీఎం జగన్‌ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ కుట్రలో భాగస్వాములు కావొద్దని అధికారులకు హితవు పలికారు.

అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారు

అచ్చెన్న అరెస్టుపై మండిపడుతున్న న్యాయవాది హరిబాబు

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీమంత్రి అచ్చెన్నాయుడు విషయంలో కొందరు పోలీసు, ఏసీబీ అధికారులు అనవసర జోక్యం చేసుకుంటున్నారని న్యాయవాది హరిబాబు ఆరోపించారు.

ఎందుకంత అత్యుత్సాహం...

అచ్చెన్నాయుడుకు శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు తీసుకెళ్తున్న సమయంలో స్థానిక సీఐ రాజశేఖర్​రెడ్డి అడ్డుకున్నారని... గంటసేపు స్ట్రెచర్ పైనే ఉంచారని తెలిపారు. అలాగే ఏసిబిలో పనిచేసే సూర్యనారాయణరెడ్డి అనే మరో అధికారి కూడా విచారణలో జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. విచారణ బృందంలో ఆయన పేరు లేకున్నా సూర్యనారాయణరెడ్డికి ఎందుకంత అత్యుత్సాహమని హరిబాబు ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

వైకాపా మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుంది: నక్కా ఆనందబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.