ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు కోసం..కేంద్రానికి సిఫార్సు చేయాలని సీఎం జగన్ని ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. సినీ రంగంలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేసిన ఎన్టీఆర్....భారతరత్న అవార్డుకు అన్ని విధాలా అర్హుడని పేర్కొన్నారు. భారత రత్న అవార్డుకు రాష్ట్రం తరఫున ఎన్టీఆర్ పేరు సూచించాలని సీఎం జగన్కు....ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 'ఎన్నికలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ అడ్డురాదు'