ETV Bharat / city

విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ జరిపించండి: ఎంపీ రఘురామ - అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సుప్రీంకోర్టు

వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నంలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై నిజాయితీగల అధికారితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని గతంలోనే చెప్పానని.. ప్రజల మన్ననలు పొందేలా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరారు.

mp raghurama krishnaraju
ఎంపీ రఘురామకృష్ణరాజు
author img

By

Published : Jul 21, 2021, 7:50 AM IST

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున.. విశాఖపట్నంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై నిజాయితీగల అధికారితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. ప్రజల మన్ననలు పొందేలా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ ముఖ్యమంత్రి, పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ, ఇంకా వారి బాటలో ఎందరో నీలాపనిందలు వేశారు. కరోనా రాకముందే నేనో టీవీ చర్చలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఉండదని చెప్పాను. అమరావతిని ఇబ్బంది పెట్టాలనే ఒకే ఒక దృక్పథంతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో ఒక బోగస్‌ ప్రచారం చేసి రాజధాని తరలింపునకు అదో ముఖ్యమైన అంశమని చెప్పారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో తుది తీర్పు వచ్చింది. అక్కడ మోసం చేసింది లేదు... మోసపోయిందీ లేదని స్పష్టమైన తీర్పు వచ్చింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగని చోట మీరు ఇదంతా చేశారు. జరిగిన చోట వదిలేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి వారు అబద్ధాల ప్రచారానికి కారకులు. ప్రసారం చేసిన ఛానళ్లు ఇప్పుడు ఏం చెబుతాయి? తప్పుడు వార్తలతో ఎంతో అన్యాయం జరిగింది. 150 మంది రైతులు గుండెపోటుతో అసువులు బాశారు" - రఘురామకృష్ణరాజు, నరసాపురం ఎంపీ

వారి కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలి..

'రాష్ట్రంపై, ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవంతో నాటి ముఖ్యమంత్రి పిలుపునకు స్పందించి, ప్రభుత్వాన్ని విశ్వసించి రూపాయి తీసుకోకుండా వారు తమ ఆస్తులు ఇచ్చారు. మనం వారికి తిరుగు టపాలో ఇచ్చింది గుండె మంటలు. వారి కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నా. చావులకు మీరే నైతిక బాధ్యులు. మీరే వెళ్లి ఆయా కుటుంబాలను ఓదార్చితే బాగుంటుంది. మన ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్రకు సీమ నుంచి తరలివచ్చిన ప్రముఖులు ఎవరు.. వారు చేసిన అరాచకాలు ఏమిటి..? వారు చేసిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఏమిటి..? సినీ ప్రముఖులకు బెదిరింపులు ఏమిటి.? బీచ్‌ రోడ్డులో ఎవరెవరి ఆస్తులను ఎలా కొల్లగొట్టారు? దసపల్లా హిల్‌ హోటల్‌ను ఏ విధంగా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఇవన్నీ మీ కలెక్టర్‌ దగ్గర ఉండొచ్చు.' చిత్తశుద్ధితో విచారణ చేయించండి అని రఘురామ పేర్కొన్నారు.

మరిన్ని విషయాలు...

  • రెండు సంవత్సరాల రెండు నెలల తర్వాత మొట్టమెదటిసారి మా పార్టీ ఎంపీలు లోక్‌సభలో ఫ్లకార్డులు చూపారు. గతంలో ఏనాడూ గొంతెత్తలేదు. రెండేళ్లలో వచ్చిన తేడా ఏమిటంటే ఒకే ఒక్కడు కారణం. వాడే వీడు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా లేదు కాబట్టి నాపై అనర్హతకు వారు చర్యలు తీసుకోలేకపోయినందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారని అందరికీ తెలుసు. ఇప్పటికైనా పోరాటం ప్రారంభించినందుకు... అందుకు కారకుడిని నేను అయినందుకు సంతోషం. మన ప్రాంతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాజ్యసభ వెల్‌లోకి దూకారు. పార్లమెంటును స్తంభింపజేస్తామన్నారు. నన్ను అనర్హుడిని చేస్తే స్తంభనలు ఆపుతామని మీరన్నారని కొందరు అన్నారు. నేను విన్నాను. మీరు అన్నారో లేదో మీకే తెలుసు. గతంలో మీ మాటలు గుర్తు చేసుకోండి. మన 25 ఎంపీలు ఒకేసారి రాజీనామా చేస్తే వాళ్లు ప్రత్యేక హోదాకు ఇస్తారన్నారు. మీ తరపున 8 మంది గెలిచి ముగ్గురు పక్కకు పోయి అయిదుగురు ఉన్నప్పుడూ మీరు అలా చెప్పారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మరికొందరు రాజీనామాకు సిద్ధమా అని అడుగుతున్నారు. 22 మంది లోక్‌సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయమని మీరు ఆజ్ఞాపిస్తే ప్రజల తరపున మీ ఆజ్ఞను శిరసావహించడానికి నేను సిద్ధం. ఆజ్ఞాపించడానికి మీరు సిద్ధమా వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి? మనకు సంఖ్యాబలం లేనప్పుడు ఒకలా మాట్లాడి.. సంఖ్యాబలం ఉన్నప్పుడు మరోలా మాట్లాడితే మీకున్న మాట తప్పని అదేదో తిప్పని వీరుడిలా మీకున్న ప్రతిష్ట మసకబారుతుంది.
  • మీరు ఎన్ని కల్పిత వాట్సప్‌ ఛాట్‌లు సృష్టించినా వాటికి ఎటువంటి విశ్వసనీయత లేదు. మీ బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేయాలని నేను పిటిషన్‌ వేశా. నేను వెయ్యి మందికి మెసేజ్‌ పంపా. అందులో మాజీ ముఖ్యమంత్రికి వెళ్లి ఉండవచ్చు. నేను ఎవరికైనా మెసేజ్‌లు పంపొచ్చు. మీకు ఎలా ఆ సమాచారం వచ్చింది. పోలీసులు, ప్రభుత్వం ఒకటా..? పోలీసులు.. సాక్షి ఒకటా? నేను రాజును.. నా బెయిల్‌ రద్దు చేయమనడం రాజద్రోహమని సీబీఐ కోర్టులో మీరు చెప్పండి.
  • మీరు పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను వాడారని విశ్వసనీయంగా తెలిసింది. మీ ఐటీ అడ్వైజర్‌ సహకరించారని అంటున్నారు. ఆధునిక మాడ్యూల్‌ వాడుతున్నారు. మీరు కూర్చున్న అయిదు కిలోమీటర్ల దూరంలో మీకు కావాలనుకున్న వాయిస్‌ ఫ్రీక్వెన్సీ, మెసేజ్‌లు మీరు రికార్డు చేసుకోవచ్చు. దానికి మీరు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా..? తీసుకుంటే తీసుకున్నామని, లేదంటే లేదని చెప్పండి. ఆ సాఫ్ట్‌వేర్‌, ఆ ఇజ్రాయిల్‌ సాంకేతికత మాకు తెలియదు అంటారా..? అదీ చెప్పండి. అటువంటి సంఘ వ్యతిరేక చర్యలను ఇక నుంచైనా ఆపేయండి.

అమిత్‌ షాను కలిసిన రఘురామకృష్ణరాజు

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మంగళవారం కలిశారు. తన ఆరోగ్య పరిస్థితిని అమిత్‌ షా అడిగి తెలుసుకున్నారని ఎంపీ తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

'మధ్యవర్తిత్వ తీర్పులను కోర్టులు మార్చలేవు'

చాహర్​ వీరోచిత ఇన్నింగ్స్​.. టీమ్ఇండియాదే సిరీస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.