ETV Bharat / city

RRR: ప్రత్యేక హోదాపై ఎంపీలంతా రాజీనామాకు సిద్ధమే: ఎంపీ రఘురామ - ఏపీకి ప్రత్యేక హోదా

mp raghurama krishnam raju
mp raghurama krishnam raju
author img

By

Published : Jul 20, 2021, 2:52 PM IST

Updated : Jul 20, 2021, 3:27 PM IST

14:49 July 20

mp raghurama krishnam raju

నిజమైన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ విశాఖలోనే జరిగిందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. రాజధాని పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు సీఎం జగన్, మంత్రి బొత్స క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన ఫోన్‌ నుంచి ఇష్టమొచ్చినవారికి మెసేజ్ చేసే హక్కు తనకుందని.. దాన్ని ప్రశ్నించడానికి జగన్ ఎవరని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రెండేళ్లుగా పార్లమెంట్‌లో గొంతు ఎత్తని వైకాపా ఎంపీలు.. ఇప్పుడు తనపై అనర్హత వేయించేందుకు మాట్లాడుతున్నారని, కానీ అది జరగదని స్పష్టం చేశారు. 

'ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై హైకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది.. అక్కడ విచారణ లేదు.ఉత్తరాంధ్రలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ వేయించండి. ప్రత్యేక హోదాపై సీఎం ఆదేశిస్తే రాజీనామాకు ఎంపీలంతా సిద్ధమే. బెయిల్ రద్దు చేయమనడం రాజద్రోహం కేసు ఎలా అవుతుంది..? వాట్సాప్‌లో ఛాటింగ్‌ బయటపెట్టామంటున్నారు. నేనెవరికి మెసేజ్‌ చేస్తే ఏంటి.. రాజద్రోహం ఎలా అవుతుంది' - ఎంపీ, రఘురామకృష్ణరాజు, నర్సాపురం

ఇదీ చదవండి

Koushik Reddy: తెరాస గూటికి కౌశిక్​ రెడ్డి.. రేపే చేరిక!

Last Updated : Jul 20, 2021, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.