ఏపీలో హిందూ దేవాలయాలను పరిరక్షించాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దిల్లీలో ఒక్క రోజు దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా తెదేపా ఎంపీ కనకమేడల, శంకరాచార్యులు, జీవీఆర్ శాస్త్రీ సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఇటీవల హిందూ దేవాలయాలపై వరుస దాడులు చూస్తే.. ఏదో వ్యూహాత్మక కుట్రతోనే జరుగుతున్నట్లు ఎంపీ రఘురామకృష్ణంరాజు అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో విదేశీ సంస్థల ప్రమేయం ఉందన్న అనుమానాలున్నాయన్న ఆయన... సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాజీనామా చేసి గెలుస్తా..
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని లిఖితపూర్వకంగా హమీ ఇస్తే రాజీనామా చేసి గెలిచేందుకు సిద్ధమని ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్ర మంత్రులకు సవాలు విసిరారు. రాజధానిని మార్చాలన్నది ప్రభుత్వ నిర్ణయమని.. కానీ ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని అన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్తే చెడ్డపేరు వస్తుందని పార్టీ నేతలకు చెప్పానన్నారు. అమరావతి కోసం తాను రాజీనామాకు సిద్ధమని రఘురామ కృష్ణరాజు స్పష్టం చేశారు. తనను రాజీనామా చేయాలని కోరుతున్న వారు ముఖ్యమంత్రి జగన్ నుంచి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామన్న హామీ పత్రాని తీసుకురావాలని వ్యాఖ్యానించారు.
వివక్ష చూపేలా పాలన: ఎంపీ రవీంద్ర కుమార్
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వైకాపా ప్రభుత్వ హయాంలో ఘటనలు జరుగుతున్నాయని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ఒక మతం పట్ల వివక్ష చూపేలా రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతుందని కనకమేడల అన్నారు.
ఇదీ చదవండి: