ETV Bharat / city

mp raghu rama letter: రాజద్రోహం సెక్షన్ల రద్దుకు మద్దతివ్వండి: ఎంపీ రఘురామ

ఏపీ మినహా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఎంపీ రఘురామ లేఖలు రాశారు. ఏపీ సీఐడీ పోలీసులు 124ఏ సెక్షన్​ను దుర్వినియోగం చేసి తనపై కేసు పెట్టారని తెలిపారు. రాజద్రోహం (సెక్షన్‌ 124ఏ) రద్దుకు పార్లమెంటు లోపల, బయట తనకు మద్దతివ్వాలని కోరారు.

mp raghu rama letter
mp raghu rama
author img

By

Published : Jun 7, 2021, 8:16 PM IST

Updated : Jun 8, 2021, 5:16 AM IST

భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని రాజద్రోహం (సెక్షన్‌ 124ఏ) రద్దుకు మద్దతు ఇవ్వాలని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. తన అరెస్టు, తదనంతర పరిణామాలపై ఆయనకు లేఖ రాశారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న దుష్పరిపాలనకు వ్యతిరేకంగా నిష్పక్షపాత విమర్శలు చేశా. దీన్ని సహించలేక వ్యక్తిగత ద్వేషంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రోద్బలంతో నాపై పలు కేసులు మోపారు. ఏపీ హైకోర్టు వాటిపై స్టే ఇచ్చింది. 11 సీబీఐ, 6 ఈడీ కేసుల్లో ఏ1గా ఉన్న సీఎం.. గత 18 నెలలుగా సీబీఐ కోర్టుకు హాజరు కాకుండా వ్యక్తిగత మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. తన కేసుల్లో భాగస్వాములు, సాక్షులుగా ఉన్న వారిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రాజ్యసభకు పంపారు. సహ నిందితుడిగా ఉన్న వ్యక్తిని సీఎస్‌గా నియమించారు. మరో మహిళా ఐఏఎస్‌ అధికారిని ఏపీ కేడర్‌కు మార్చారు.

సీఎం, సీఎస్‌ నేతృత్వంలోనే పనిచేసే అధికారులు సాక్ష్యాలను, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన బెయిలు రద్దు చేయాలని సీబీఐ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశా. ఈ సమయంలో ఏపీ సీఐడీ పోలీసులు సుమోటోగా నాపై రాజద్రోహం కేసు మోపారు. లోక్‌సభ స్పీకరు అనుమతి తీసుకోకుండానే అరెస్టు చేసి హైదరాబాద్‌ నుంచి గుంటూరు తీసుకెళ్లారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో నాపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారి ఓ ఎంపీపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. కస్టడీలో అనాగరికంగా, క్రూరంగా ప్రవర్తించారు. నాపై చేసిన దాడి ఒక పార్లమెంటేరియన్‌పై చేసిన దాడి మాత్రమే కాదు. పార్లమెంటుపైనే చేసిన దాడి. రాజద్రోహం కేసులు మరెవరిపై మోపకుండా పార్లమెంటులో లేవనెత్తుతా. నాపై దాడిని ఖండించడంతోపాటు ఆ సెక్షన్ల రద్దుకు మీ ఎంపీలు మద్దతు ఇచ్చేలా చూడండి’ అని లేఖలో కోరారు. ఇదే లేఖను ఏపీ ముఖ్యమంత్రి మినహా దేశంలోని అందరు ముఖ్యమంత్రులకు రఘురామకృష్ణరాజు పంపినట్లు తెలిసింది.
లేఖను అధికారులకు పంపిన బిహార్‌ సీఎం
రాజద్రోహం సెక్షన్ల రద్దుకు మద్దతు కోరుతూ, తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌కు లేఖ రాశారు. ఆ లేఖను నీతీశ్‌.. బిహార్‌ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, న్యాయశాఖ కార్యదర్శులకు పంపించారు.
ఎంపీపై దాడి బాధించింది..: సంజయ్‌ జైస్వాల్‌
కస్టడీలో తనను హింసించారంటూ ఎంపీ రఘురామ రాసిన లేఖపై పలు రాష్ట్రాలు, పార్టీలకు చెందిన ఎంపీలు స్పందిస్తున్నారు. ఇప్పటికే మాణిక్యం ఠాగూర్‌, పినాకి మిశ్రా, ప్రేమ్‌ చంద్రన్‌, చంద్రశేఖర్‌ సాహూ, మహువా మెయిత్రా, పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ ఘటనను ఖండించి ఎంపీకి మద్దతు తెలిపారు. తాజాగా పశ్చిమ చంపారన్‌ లోక్‌సభ సభ్యుడు సంజయ్‌ జైస్వాల్‌(భాజపా-బిహార్‌) ఎంపీకి మద్దతుగా నిలిచారు. రఘురామపై దాడి తనను బాధించిందని తెలిపారు. ఘటనను పార్లమెంటులో ప్రస్తావిస్తానని ఈ-మెయిల్‌ ద్వారా రఘురామకు తెలియజేశారు.

ఇదీ చదవండి:

ap cid: దిల్లీ పోలీసులకు ఎంపీ రఘురామ ఫిర్యాదుపై సీఐడీ స్పందన

Last Updated : Jun 8, 2021, 5:16 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.