మరోసారి వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. పందులే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్‌గా వస్తుందంటూ ఘూటుగా స్పందించారు. తనను విమర్శించిన వాళ్లు జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. జగన్ ఇంటికి వెళ్లనని ఎన్నికల ముందే చెప్పానని అన్నారు. ఈ విషయంలో తనకి ఇష్టంలేదని తెలిసి ఎయిర్‌పోర్టులో వాళ్లే వచ్చి కలిశారని స్పష్టం చేశారు.
'నన్ను విమర్శించిన వాళ్లు రాజీనామా చేస్తే నేనూ చేస్తాను. మా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో నాపై తిట్ల పర్వం కొనసాగించారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఇసుక బ్రోకర్. ఇళ్ల స్థలాల్లోనూ ఆయన దండుకున్నారు. కొట్టు సత్యనారాయణ అరాచకాలు ఆయన మేనల్లుడే చెబుతారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు కూడా సీఎం అపాయింట్‌మెంట్ దొరక్క బాధపడ్డారు' - రఘురామకృష్ణరాజు, నరసాపురం ఎంపీ
మంత్రి పేర్ని నాని కౌంటర్..
అంతకుముందు వైకాపా నేతలను ఉద్దేశిస్తూ సోమవారం రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని ఘూటుగా స్పందించారు. రఘురామకృష్ణరాజుకి 3 పార్టీలు తిరిగినా ఎవరూ సీటు ఇవ్వలేదని అన్నారు. గత ఎన్నికల్లో నామినేషన్ వేసి ఎందుకు విత్ డ్రా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకు ఎన్ని వచ్చాయో..? మీకు ఎన్ని ఓట్లు వచ్చాయో? సరిచూసుకోండని సూచించారు. మీ ఎంపీ స్థానంలోని ఎమ్మెల్యేలను ఎలా గెలిపించారో చెప్పాలన్నారు. వైఎస్ఆర్ బొమ్మ, జగన్ కష్టంపైనే వైకాపాలోని ఎమ్మెల్యేలు గెలిచారని పేర్ని నాని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: