ETV Bharat / city

జమ్మలమడుగు వైకాపాలో స్నేహగీతం.. రామసుబ్బారెడ్డి ఇంటికి ఆ ఇద్దరు..! - ex minister ramasubba reddy latest news

జమ్మలమడుగులోని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఇంటికి ఎంపీ అవినాష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెళ్లారు. ఏడాది నుంచి దూరంగా ఉన్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కలవటం ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ ఆదేశాలతో ఈ పరిణామం సాకారమైనట్టు సమాచారం.

జమ్మలమడుగు రాజకీయం
mp avinash reddy and mla sudhir reddy went to ramasubba reddy
author img

By

Published : Apr 13, 2021, 10:37 AM IST

Updated : Apr 13, 2021, 3:52 PM IST

జమ్మలమడుగు వైకాపాలో స్నేహ గీతం

కడప జిల్లా జమ్మలమడుగు వైకాపాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఇంటికి ఎంపీ అవినాష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెళ్లారు. ఏడాది నుంచి దూరంగా ఉంటున్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. ఒక్కసారిగా సమావేశం కావటంతో వీరిద్దరి మధ్య మైత్రికి అడుగులు పడినట్లు తెలుస్తోంది.

ఇటీవల ముఖ్యమంత్రి జగన్​తో భేటీ అయిన రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ హామీ దక్కింది. అలాగే.. వచ్చే ఎన్నికల్లోనూ సుధీర్ రెడ్డికే ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందన్న స్పష్టత సైతం జగన్ నుంచి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో.. జగన్ ఆదేశాలతోనే.. ఇద్దరి మధ్య ఎంపీ అవినాష్ సమక్షంలో భేటీ జరిగినట్టు సమాచారం.

ఇదీ చదవండి:

చంద్రబాబు భద్రతా సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు

Last Updated : Apr 13, 2021, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.