Movie Tickets Committee Meet: సచివాలయంలో సినిమా టికెట్ ధరల ఖరారు కమిటీ భేటీ అయింది. సమావేశంలో వివిధ అంశాలపై సిఫార్సులు చేసినట్లు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ తెలిపారు. త్వరితగతిన కమిటీ నివేదిక ఇవ్వాలని కోరామన్నారు. మల్టీప్లెక్స్ థియేటర్ యజమానులు సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశామని పేర్కొన్నారు. సినీ పరిశ్రమ.. కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తోందన్నారు. టికెట్ ధరల అంశం ఇంకా ఖరారు కాలేదన్న రాందాస్.. ఏబీసీ సెంటర్లలో టికెట్ రేట్లు పెంచాలని కోరామని వెల్లడించారు.
కమిటీ సభ్యులంతా.. వారివారి రంగాల్లో ఉన్న అంశాలను నివేదించామని నిర్మాతల మండలి తరుపున బాలరత్నం తెలిపారు. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆహార పదార్థాల ధరలు చాలా అధికంగా ఉన్నాయన్నారు. ఎమ్మార్పీ రేట్లకు విక్రయించాల్సిన వాటిని ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముతున్నారు.. ఈ అంశాలపై తాము ఇచ్చిన సిఫార్సులతో ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
టికెట్ ధరలను నిర్దారించే అంశంపై కమిటీ సానుకూలంగానే అంశగాలను పరిశీలించిందని సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడు రాం ప్రసాద్ అన్నారు. ఏసీ, నాన్ ఏసీ వర్గీకరణ ప్రకారం టికెట్ రేట్లు ఉండాలని చెప్పామన్నారు. పంచాయతీల పరిధిలో ఏసీ థియేటర్లు ఉంటే టికెట్ రేట్లు పెంచాలని సూచించినట్లు వివరించారు.
ఇదీ చదవండి:
PRC Issue: లిఖితపూర్వక ఆహ్వానం వస్తేనే చర్చలకు వెళ్తాం: ఉద్యోగ సంఘాల నేతలు