Monsoon Enters Telangana : తెలంగాణలోకి వరణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఇక నుంచి వర్షాలు దంచికొట్టే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు భానుడి భగభగకు.. ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు చిరుజల్లులు కురవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తొలకరి తెచ్చిన ఆహ్లాదాన్ని హాయిగా అనుభవిస్తూ ఆదివారం పూట కుటుంబంతో సంతోషంగా గడిపారు.
మరోవైపు నైరుతి రుతుపవనాలు ఇవాళ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ రాష్ట్ర అధికారి శ్రావణి తెలిపారు. రాష్ట్రంలోనూ వర్షాలు కురుస్తున్నందున వాతావరణం చల్లబడిందని చెప్పారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి వరకూ పలు చోట్ల వర్షాలు కురిశాయని వెల్లడించారు. అత్యధికంగా లింగాపూర్(మంచిర్యాల జిల్లా)లో 8.7 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వివరించారు. గతేడాది జూన్ 5న రుతుపవనాలు రాగా ఈ ఏడాది ఇప్పటివరకూ ప్రవేశించలేదు. సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఇవీ చదవండి :