నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిసింది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోను ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సమావేశం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలను ఎలా బలోపేతం చేయాలన్న విషయంపై చర్చించామని అన్నారు. ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌కు స్పందించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు... 'వాట్ ఏ మ్యాన్ నరేంద్రమోదీ' అంటూ రీట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: