ETV Bharat / city

నివర్ తుపాన్: నెల్లూరు, రాయలసీమకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన - ఏపీలో భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. నివర్ తుపాను ప్రభావం రాష్ట్రంలోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

weather
weather
author img

By

Published : Nov 24, 2020, 2:23 PM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారిన తుపానుపై.. అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. దుగరాజపట్నం తుపాను షెల్టర్‌ను కలెక్టర్‌ చక్రధర్‌బాబు పరిశీలించారు. లోతట్టు ప్రాంత ప్రజలను తుపాను షెల్టర్ కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. విద్యుత్‌, వైద్యశాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో టోల్‌ఫ్రీ నెం.1077 ఏర్పాటు చేశామని తెలిపారు.

తుపాను దృష్ట్యా కృష్ణా జిల్లాలో లోతట్టు గ్రామాల ప్రజలను కలెక్టర్ ఇంతియాజ్ అప్రమత్తం చేశారు. అధికారులు, రెవెన్యూ యంత్రాంగానికి పలు ఆదేశాలు జారీచేశారు. అన్ని డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేశారు. బందర్‌ కంట్రోల్‌ రూమ్‌ నెం. 08672 252572, విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం కంట్రోల్‌ రూమ్‌ నెం. 0866 2474805, విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్‌ రూమ్‌ నెం.0866 2574454, నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్‌ రూమ్‌ నెం. 08656 232717, రెవెన్యూ డివిజనల్ కార్యాలయం బందర్ ఫోన్ నెంబర్. 08672 252486, గుడివాడ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఫోన్ నెంబర్. 08674 243697లు ఏర్పాటుచేశామన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

మరోవైపు నివర్ తుపాను ప్రభావం ఎలా ఉంటుందోనని రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఇప్పటికే రైతులు కుదేలయ్యారు. ఉన్నకాస్త పంటను రక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ నివర్‌ తుపాన్‌ హెచ్చరికతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తుపాను కారణంగా ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు కురిస్తే పంట మొత్తం దెబ్బ తింటుందని ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:

మరింత తీవ్రంగా మారిన వాయుగుండం.. కోస్తా, సీమపై ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.