అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిన్న ఆగ్నేయ బంగాళా ఖాతం పరిసర ప్రాంతాలలోని శ్రీలంక, తమిళనాడు తీరాల్లో ఉన్న అల్పపీడనం ఈ రోజు అదే ప్రదేశంలో కొనసాగుతుందని ప్రకటించింది.
ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా సగటు సముద్ర మట్టానికి సుమారు 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి స్థిరంగా కొనసాగుతోందన్నారు. ఇది రాగల 3 నుంచి 4 రోజులలో పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉన్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.
నిన్న తూర్పు గాలుల్లో ఉన్న ఉపరితల ద్రోణి.. ఈ రోజు ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో ఉన్న శ్రీలంక, తమిళనాడు తీరాల్లో ఉన్న అల్పపీడనం నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రా తీరం వరకు కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు వెల్లడించింది. ఈ రోజు క్రింది స్థాయి గాలులు ముఖ్యంగా ఈశాన్య దిశ నుంచి రాష్ట్రంలోకి వీస్తున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి:
CM Jagan : ఉగాదికల్లా డిజిటల్ లైబ్రరీలు... అధికారులకు సీఎం ఆదేశం