ETV Bharat / city

వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా విఫలమయ్యారు: బుద్దా - ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు మండిపడ్డారు. కనకదుర్గ ఆలయంలో రథంపై వెండి సింహాలు మాయమై 48 గంటలు గడిచినా.. ఇంత వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని నిలదీశారు.

MLC nagaJagadesh
MLC nagaJagadesh
author img

By

Published : Sep 17, 2020, 6:57 AM IST

ఉమ్మడి రాష్ట్రం నుంచి నవ్యాంధ్రప్రదేశ్ వరకూ.. అనేక మంది దేవాదాయశాఖ మంత్రులుగా చేశారని.. ఎవరి హయాంలో దేవాలయాల్లోనూ ఈ విధంగా వరుస ఘటనలు జరగలేదని ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు విమర్శించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు, వరుస ఘటనలపై మంత్రి ఎందుకు సమీక్ష నిర్వహించలేదని ప్రశ్నించారు. వెల్లంపల్లి దేవాదాయశాఖను తన సొంత ఆదాయ శాఖగా మార్చుకున్నారని బుద్దా నాగజగదీశ్వర రావు ఆరోపించారు. వెల్లంపల్లి దేవాదాయశాఖను గాలికొదిలి.. మంత్రి పదవి అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఆయనకు తన ఆదాయంపై ఉన్న శ్రద్ధ దేవాదాయ శాఖపై లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి... కొత్తగా 8,835 పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.