ఇంద్రకీలాద్రిలో మాయమైన సింహపు ప్రతిమలు మంత్రి వెల్లంపల్లి ఇంట్లోనే ఉన్నాయని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. దుర్గమ్మ ఆభరణాల లెక్కలు కూడా వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రితో పాటు ఈవో కాల్ లిస్ట్ బయటకు తీస్తే వ్యవహారం బయటకు వస్తుందని అన్నారు.
2009లో వెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే దుర్గమ్మ దేవస్థాన పరిధిలో జరిగే ప్రతి అవినీతిలో ఆయన ప్రమేయం ఉందన్నారు. జేబులో ఎప్పుడూ నాలుగు పార్టీల జెండాలు పెట్టుకొని తిరగడం వెల్లంపల్లికి అలవాటని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తికి జగన్ మంత్రి పదవి ఎలా ఇచ్చారో తెలియదన్నారు.
ఇదీ చదవండి: