నగదు బదిలీ పేరుతో వ్యవసాయ విద్యుత్ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేసే చర్యలకు పూనుకోవడం సరికాదని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. రైతులకు అన్యాయం చేసేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నారన్న ఆయన... రాష్ట్రంలోని 18 లక్షల మంది రైతులకు సంవత్సరానికి 10 వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం మోపడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. గత 15 నెలల జగన్ ప్రభుత్వ రైతు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. రైతు సంక్షేమం పై గతంలో చాలా మాటలు చెప్పిన జగన్...అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక రైతు పథకాలను రద్దు చేశారన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు ఉపయోగపడే బిందుసేద్యం పథకానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం చాలా దుర్మార్గమన్నారు.
ఇదీ చదవండి