ETV Bharat / city

Mla Rajasingh: రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే రాజాసింగ్​.. కారణమేంటంటే.!

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోని అన్ని వర్గాల వారికి దళితబంధులాంటి ప్యాకేజీ ప్రకటిస్తే.. రాజీనామా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. హుజురాబాద్‌ ఉపఎన్నికలో గెలిచేందుకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని రాజాసింగ్​ ఆరోపించారు. తాము సైతం రాజీనామా చేస్తే నిధులు వస్తాయంటూ.. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు కోరుతున్నారని తెలిపారు.

Mla Rajasingh
Mla Rajasingh
author img

By

Published : Aug 2, 2021, 6:09 PM IST

రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే రాజాసింగ్​.. కారణమేంటంటే.!

తెలంగాణ రాష్ట్రంలోని గోషామహల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం వేల కోట్ల నిధులిస్తే రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. గోషామహల్‌ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తేల్చుకుందామని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.

సీఎం కేసీఆర్​ గారూ.. నా నియోజకవర్గ ప్రజలంతా నన్ను ఎమ్మెల్యే పదవి నుంచి రాజీనామా చేయమంటున్నారు. అలా చేస్తే గోషామహల్​కు వేల కోట్ల నిధులు వస్తాయి.. అభివృద్ధి చెందుతుందంటున్నారు. మీరు మా నియోజకవర్గానికి నిధులివ్వండి. దళిత బంధు ఇలాగే ఇక్కడ కూడా ఓ పథకం అమలు చేయండి. మరుక్షణమే నేను రాజీనామా చేస్తా. - రాజాసింగ్​, గోషామహల్ ఎమ్మెల్యే

తనను రాజీనామా చేయమని నియోజకవర్గ ప్రజలు ఒత్తిడి తెస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. ముఖ్యమంత్రి నిధులు ప్రకటించిన వెంటనే స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తానని స్పష్టం చేశారు. గోషామహల్​లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద ఓసీలకు సైతం రూ. పది లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. జీహెచ్‌ఎంసీ నిధులన్నీ ఎంఐఎం కోసమే ఖర్చు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని సామాజిక మాధ్యమాల్లో డిమాండ్ చేస్తున్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్‌కు బడుగులు, రైతులపై ప్రేమ వస్తుందని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:

chintha mohan: 'సీఎం జగన్​ రాజకీయ పతనం ప్రారంభమైంది..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.