Jagga Reddy about Revanth: టీపీసీసీ రేవంత్ రెడ్డి మంచి చేస్తే అభినందిస్తా.. కరెక్ట్ లేకపోతే ప్రశ్నిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రేవంత్‌పై అధిష్ఠానానికి తాను రాసిన లేఖ ఎలా లీక్ అయ్యిందో తెలవదని.. అదెలా జరిగిందో తెలుసుకుంటానని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు ముందు ధర్నా ఎవరిని అడిగి చేశారని కొందరు ప్రశ్నిస్తున్నారని.. ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని చేశానని గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు.
నా లేఖ.. నాకు తెలియకుండా మీడియాకు లీక్ అయ్యింది. హైదరాబాద్ అనేది అందరికీ జాగీర్దార్. ధర్నాలు చేయడం అందరికీ హక్కు ఉంటుంది. మాలో మాకు ఎన్ని విభేదాలు ఉన్నా.. మా మీదకు ఎవరొచ్చినా కలిసి పోరాడతాం. ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి కట్టుగా పోరాడతాం. అంతర్గతంగా మాలో మాకు ఎన్నో ఉంటాయి. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు మాట్లాడను.
-జగ్గారెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే
'హైదరాబాద్ అనేది అందరిదీ.. ధర్నాలు చేయడానికి అందరికీ హక్కు ఉంటుందని' అన్నారు. తమకు ఎన్ని విభేదాలు ఉన్నా.. ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. పార్టీపరంగా అంతర్గతంగా ఎన్నో ఉంటాయని.. వాటి గురించి తాను మాట్లాడనని అన్నారు.
ఇదీ చదవండి: APPSC Job Notifications: రెవెన్యూ, దేవదాయశాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్