ETV Bharat / city

Telangana: తెలంగాణ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జైలు శిక్ష! - తెలంగాణ వార్తలు

పోలీసుపై దాడి కేసులో తెలంగాణలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్​కు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించింది.

MLA Danam Nagender
ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జైలు శిక్ష
author img

By

Published : Jul 7, 2021, 8:47 PM IST

Updated : Jul 7, 2021, 10:13 PM IST

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్​కు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించింది. ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. బంజారాహిల్స్​లో 2012లో కారుకు అడ్డు వచ్చిన ఓ పోలీసుపై దాడి చేసి బెదిరించారన్న అభియోగంపై దానం నాగేందర్​తో పాటు చట్నీ రాజు అనే వ్యక్తిపై కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు నుంచి ఇటీవల ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానానికి అభియోగపత్రం బదిలీ అయింది.

విచారణ జరిపిన ప్రజా ప్రతినిధుల కోర్టు దానం నాగేందర్​పై ఐపీసీ 323 సెక్షన్ కింద అభియోగాలు రుజువైనట్లు ప్రకటించింది. దానం నాగేందర్​కు ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించిన కోర్టు.. జరిమానా చెల్లించకపోతే మరో నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. అప్పీలు చేసుకునేందుకు వీలుగా దానం నాగేందర్​పై శిక్షను నెల రోజుల పాటు నిలిపివేసింది.

ఇదీ చదవండి:

Janasena: అన్యాయాలు జరిగితే ఎదుర్కొనేందుకు వెనుకాడబోం: పవన్ కల్యాణ్

Last Updated : Jul 7, 2021, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.