కరోనా మూడో దశ వస్తే చిన్నారులకు చికిత్స అందించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్సు కమిటీ సూచించిన మేరకు.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ బారి నుంచి కోలుకున్న అనంతరం చిన్న పిల్లలకు సంక్రమించే మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ (మిస్సీ) వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చింది. ఆరోగ్యశ్రీ కింద చేరిన చిన్నారికి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే రూ.77,533 ఖర్చు అవుతుంది. వెంటిలేటర్, ఇంజెక్షన్ ఉపయోగిస్తే రూ.25వేలు ఆరోగ్యశ్రీ తరఫున చెల్లింపులు జరుగుతాయి.
అంతకంటే తక్కువ స్థాయి చికిత్సకు రూ.62,533, మధ్యస్థ స్థాయి చికిత్సకు రూ.42,533, స్వల్ప స్థాయి చికిత్సకు రూ.42,183 ఖరారు చేశారు. రోగి అవసరాలు అనుసరించి అదనంగా వినియోగించే ‘ఇమ్యూనోగ్లోబిన్స్’ ఇంజెక్షన్ ధర రూ.13,500గా నిర్ణయించారు. రోగికి అందించే చికిత్సకు తగ్గట్లు ఆధారాలు చూపితేనే ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ఆసుపత్రులకు చెల్లింపులు జరుగుతాయి.
ఇదీ చదవండి: