ETV Bharat / city

Mission Bhagiratha: మిషన్​ భగీరథ అంచనా వ్యయం పెంపు

తెలంగాణలో చేపడుతున్న మిషన్​ భగీరథ పనుల్లో భాగంగా ఇన్​టేక్​ నిర్మాణం, నీటి శుద్ధి కేంద్రం సహా పైప్​లైన్ల పనుల కోసం అంచనా వ్యయాన్ని రూ.674 కోట్ల నుంచి రూ.1,212 కోట్లకు పెంచారు. ఈ మేరకు మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్​ ఉత్తర్వులు జారీ చేశారు.

author img

By

Published : Jul 29, 2021, 8:41 PM IST

మిషన్​ భగీరథ అంచనా వ్యయం పెంపు
మిషన్​ భగీరథ అంచనా వ్యయం పెంపు

మిషన్ భగీరథలో భాగంగా తెలంగాణలోని కొమురవెల్లి మల్లన్న సాగర్ నుంచి జనగాం, గజ్వేల్, ఆలేరు, భువనగిరి, మేడ్చల్ సెగ్మెంట్లకు నీటి తరలింపు పనుల అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. పనుల్లో భాగంగా ఇన్​టేక్​ నిర్మాణం, నీటి శుద్ధి కేంద్రం సహా పైప్​లైన్ల పనుల కోసం రూ.674 కోట్ల అంచనా వ్యయంతో 2020 జనవరిలో పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. పనుల్లో మార్పులు, చేర్పుల నేపథ్యంలో అంచనా వ్యయాన్ని 674 కోట్ల నుంచి రూ.1,212 కోట్లకు పెంచారు.

ఈ మేరకు ఈఎన్సీ ప్రతిపాదనలను ఆమోదించి.. సవరించిన అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు జారీచేసింది. దీంతో పాటు ఇప్పటికే పనులు చేస్తున్న మెయిల్ సంస్థకే అదనపు పనులు అప్పగించేందుకూ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్​ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీచూడండి:

దేవినేని ఉమ కుటుంబసభ్యులను ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.