ETV Bharat / city

ఓయో రూమ్‌కు తీసుకెళ్లి.. మత్తు మందు ఇచ్చి.. బాలికపై గ్యాంగ్ రేప్‌ - ap latest crime news

Gang rape in Old city
బాలికపై గ్యాంగ్ రేప్‌
author img

By

Published : Sep 15, 2022, 9:00 AM IST

Updated : Sep 15, 2022, 10:34 AM IST

08:59 September 15

బాలికపై గ్యాంగ్ రేప్‌

Gang rape in Old city: 16 ఏళ్ల బాలికపై యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన హైదరాబాద్​లోని పాతబస్తీలో జరిగింది. ఆ మైనర్​ను రెండు రోజులు పాటు ఓయో లాడ్జిలో ఉంచారు. ఆపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొదట ఆమెను కిడ్నాప్ చేసి... హైదరాబాద్‌లోని రెండు హోటళ్లకు బాలికను మార్చుతూ.. ఆపై ఆమెపై నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మొదట సుజన్ స్టే ఇన్ హోటల్​కు... తర్వాత త్రీక్యాసిల్ హోటల్‌కు ఆమెను నిందితులు తీసుకెళ్లారు. ఆ తరవాత ఓయో రూమ్‌కు తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డారు.

తరువాత ఆ యువకులు బాలికను లాడ్జిలోనే వదిలి వెళ్లారు. తమ కుమార్తె అదృశ్యమైందని ఆమె తల్లిదండ్రుల 13వ తేదీన డబీర్​పురా పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదుతో అదృశ్య కేసుగా పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు... ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు యువకులు బాలికకు తెలిసినవారే. వారిని రెయిన్​ బజార్​కు చెందిన సయ్యద్ రావిన్ష్, రియాసత్ అహ్మద్‌లుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్​ చేసి రిమాండ్‌కు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 15, 2022, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.