రాష్ట్రంలో ఖనిజ వనరులను వినియోగించుకునేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తున్నదని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ministers peddireddy), పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి( gouthamreddy ) తెలిపారు. సచివాలయంలో మైనింగ్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు (mining based industries)పై మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని డోలమైట్, లైమ్, సిలికాశాండ్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, ఖనిజ వనరుల లభ్యతపై మంత్రులు సమీక్షించారు. రాష్ట్రంలో విస్తారంగా ఉన్న సిలికా శాండ్‌ను వినియోగించుకుని పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూసే వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తామని మంత్రులు వెల్లడించారు.
పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాల పెంపుదల కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రులు అన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు పారదర్శక విధానంను తీసుకువచ్చామని గుర్తు చేశారు. నెల్లూరు, కర్నూలు జిల్లాలో గ్లాస్ పరిశ్రమలకు ఉపయోగించే సిలికాశాండ్ (silica sand) నిల్వలు ఉన్నాయని, అలాగే డోలమైట్ (dolomite), లైమ్ ఖనిజ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని వివరించారు. వాటిని వినియోగించుకునేందుకు పలు భారీ పరిశ్రమలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని అన్నారు. అటువంటి పరిశ్రమలకు అన్ని విధాలుగా తోడ్పాటును అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి:
RDS Controversy: ఆర్‌డీఎస్ కుడికాలువ నిర్మాణం సక్రమమే: మంత్రి అనిల్