ETV Bharat / city

పవన్ కల్యాణ్ రాష్ట్రానికే గుదిబండగా తయారయ్యారు: మంత్రి సురేశ్​ - minister suresh comments on pawan kalyan

పవన్​ కల్యాణ్​పై మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ అప్పుడప్పుడు వచ్చి కులాలను రెచ్చగొట్టి వెళ్తారని మంత్రి ఆదిమూలపు సురేశ్​ ఆరోపించారు. పవన్ కల్యాణ్ సినిమాలకు కాల్ షీట్స్ లేకపోతేనే ప్రజల్లోకి వస్తారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు.

Minister Suresh
Minister Suresh
author img

By

Published : Oct 1, 2021, 12:40 PM IST

పవన్ కల్యాణ్ రాష్ట్రానికే గుదిబండగా తయారయ్యారని మంత్రి సురేశ్‌ విమర్శించారు. పవన్‌ అప్పుడప్పుడు వచ్చి కులాలను రెచ్చగొట్టి వెళ్తారని ఆరోపించారు. రాజకీయంగా ఎదగాలంటే ఇది పద్ధతి కాదని పవన్ తెలుసుకోవాలని హితవు పలికారు. తెదేపా భావజాలంలోనే పవన్ వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలొస్తే ఏదో ఒక అలజడి సృష్టించాలన్నదే పవన్ ధోరణి అని మంత్రి సురేశ్‌ పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ సినిమాలకు కాల్ షీట్స్ లేకపోతేనే ప్రజల్లోకి వస్తారని మంత్రి శంకర్ నారాయణ విమర్శించారు. ప్రజలందరూ సంతోషంగా జీవిస్తూ ఏ రాజకీయ పార్టీల వైపు చూడడం లేదని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో రహదారుల నిర్వహణ సరిగా లేదన్న మంత్రి.. వర్షాలు తగ్గిన వెంటనే మరమ్మlతులు చేపట్టనున్నట్లు తెలిపారు.

బూటకపు ఉద్యమాలు..

రాజధానిలో అమరావతి రైతులు బూటకపు ఉద్యమాలు చేస్తున్నారని.. షెడ్లు వేసుకుని కాలక్షేపానికి వస్తున్నారని ఆరోపించారు. రాజధాని ప్రజలు తెదేపాకు వ్యతిరేకంగా ఉన్నారనడానికి మంగళగిరి ఎన్నికలే నిదర్శనమన్నారు. వీఐపి ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి మంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇదీ చదవండి:

AP ICET Results: ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.