ETV Bharat / city

'అందరూ బయటకు వచ్చి చప్పట్లు కొట్టండి.. వారిని అభినందించండి' - Peddireddy Ramachandra Reddy news

సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి రేపటికి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా.. అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రేపు సాయంత్రం 7 గంటలకు అందరూ ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి సచివాలయ సిబ్బందిని అభినందించాలని కోరారు. ప్రధాని మోదీ కూడా సచివాలయ వ్యవస్థ పనితీరును అభినందించారని చెప్పారు.

Minister Ramachandra Reddy Press Meet Over village Secretariat
రామచంద్రారెడ్డి
author img

By

Published : Oct 1, 2020, 5:20 PM IST

సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి రేపటికి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా.. అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను అభినందించనున్నట్లు వివరించారు. రేపు సాయంత్రం 7 గంటలకు అందరూ ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి అభినందించాలని కోరారు. గత ఏడాది గాంధీ జయంతి రోజున గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించామని గుర్తు చేశారు.

మరే రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థ లేదని అన్నారు. అవినీతికి తావు లేకుండా అన్ని సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ప్రతి 50 కుటుంబాలకు గ్రామ, వార్డు వాలంటీర్​ను అందుబాటులో ఉంచామని వివరించారు. గ్రామ స్వరాజ్యం కోసం సీఎం జగన్ ఆ దిశగా అడుగులు వేశారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం సచివాలయ వ్యవస్థ పనితీరును అభినందించారని మంత్రి చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.