ETV Bharat / city

minister perni nani: వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం: పేర్నినాని - Minister Perninani latest news

minister perni nani: వరదలు, వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ఒక్కో కుటుంబానికి రెండు వేల రూపాయలు సహా ఇతర నిత్యావసరాలు అందిస్తామన్నారు.

పేర్నినాని
పేర్నినాని
author img

By

Published : Nov 23, 2021, 9:50 AM IST

minister perni nani: వరదలు, వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి పేర్నినాని స్పష్టంచేశారు. ఇంటికి 2 వేలు, ఇతర నిత్యవసరాలు అందించాలని నిర్ణయించిన్నట్లు తెలిపారు. పునరావాసం కోసం అన్ని చర్యలు తీసుకున్నామన్న మంత్రి... 104 సేవలను నాలుగు జిల్లాలకు మరింత విస్తృతంగా విస్తరిస్తున్నట్లు వివరించారు.

ఎవరికి ఏం ఇబ్బంది ఉన్న 104 సేవలు ఉపయోగించుకోవచ్చన్నారు. ముగ్గురు విధి నిర్వహణలో చనిపోయారని వారికి 25 లక్షల నష్టపరిహారన్ని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మొత్తం 10 మంది మృతి చెందారని, వారికి 5 లక్షల ఎక్స్​గ్రేషియ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు సరఫరా చేస్తామన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకి పరిహారం ఇస్తామని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి: DRONE VISUALS: పెన్నానది వరద బీభత్సం.. డ్రోన్ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.