ETV Bharat / city

జూన్​ 4న 'వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర' రెండో విడత ఆర్థిక సాయం

జూన్ 4న వైఎస్సాఆర్​ వాహన మిత్ర పథకం కింద రెండో విడత ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఆర్టీసీలో పొరుగు సేవల ఉద్యోగులను తొలగించట్లేదని మరోసారి మంత్రి స్పష్టం చేశారు.

minister perni nani
minister perni nani
author img

By

Published : May 18, 2020, 12:15 PM IST

Updated : May 18, 2020, 1:02 PM IST

జూన్ 4న వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం కింద లబ్ధిదారులకు రెండో ఏడాది ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి పేర్నినాని అన్నారు. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థికసాయం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గతేడాది ఆర్థిక సాయం పొందినవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయ సిబ్బంది సోషల్ ఆడిట్ చేసి అర్హులను నిర్ణయిస్తారని మంత్రి అన్నారు. కొత్తవాళ్లు గ్రామ సచివాలయంలో ఈనెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సీఎం నిర్ణయం తీసుకోవాలి

బస్సులు నడపడంపై సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి పేర్ని నాని చెప్పారు. రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌పై సీఎం చర్చిస్తున్నారన్న ఆయన...బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతిస్తే 24 గంటల్లో బస్సు సర్వీసులు మొదలవుతాయని వెల్లడించారు. ఆర్టీసీలో పొరుగు సేవల ఉద్యోగులను తొలగించట్లేదని మంత్రి పునరుద్ఘాటించారు.

ఆర్థిక సమస్యలతోనే పొరుగుసేవలకు వేతనాలు చెల్లించలేదు

ఆర్థిక సమస్యలతోనే...

ఆర్థిక సమస్యలతోనే పొరుగుసేవలకు వేతనాలు చెల్లించలేదు. వేతనాలు చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వలస కార్మికుల తరలింపునకు మాత్రమే మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రజా రవాణాకు సంబంధించి నిర్ణయం వస్తే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం- కృష్ణబాబు, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు

Last Updated : May 18, 2020, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.