ETV Bharat / city

PERNI NANI : 'పెట్రో ధరలు పెంచిన వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తారా?'

author img

By

Published : Nov 8, 2021, 6:20 PM IST

పెట్రోల్ ధరను(petrol prices) రూ.116 వరకు తీసుకెళ్లిన కేంద్రం ఇప్పుడు రాష్ట్రాలు తగ్గించాలని సూచిస్తే ఎలా అని మంత్రి పేర్ని నాని(minister perni nani) ప్రశ్నించారు. ప్రజలకు ఏమీ గుర్తుండదని భాజపా నేతలు భావిస్తున్నారా? అని నిలదీశారు. లీటర్ పెట్రోల్, డీజిల్ పై 5, 10 రూపాయలు తగ్గించి జనాన్ని ఉద్దరించినట్లు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. పెట్రో ధరలపై దిల్లీలోని నార్త్‌బ్లాక్(north block in delhi) వద్ద ధర్నా చేస్తే తానూ వస్తానని స్పష్టం చేశారు.

మంత్రి పేర్ని నాని
మంత్రి పేర్ని నాని

మంత్రి పేర్ని నాని

పెట్రోల్ ధరను రూ.116 వరకు తీసుకెళ్లిన కేంద్రం... ఇప్పుడు రాష్ట్రాలు తగ్గించాలని సూచిస్తే ఎలా అని మంత్రి పేర్ని నాని(minister perni nani fire on central government) ప్రశ్నించారు. పెట్రో ధరలు పెంచిన వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.70 ఉండాల్సిన పెట్రోల్ ధరను రూ.116 వరకు తీసుకువెళ్లి... ఇప్పుడు పెట్రోల్​పై కేవలం రూ.5, డీజిల్​పై రూ.10 తగ్గించారని ఆక్షేపించారు. కొన్ని నెలలుగా వీర బాదుడు బాది ఇప్పుడు కేవలం అతి తక్కువ మొత్తాన్ని తగ్గిస్తారా? అని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్​పై రూ.30 తగ్గించాలని డిమాండ్(perni nani demand for increase petrol prices) చేశారు. రోడ్ల మరమ్మతుల కోసమే పెట్రోల్‌, డీజిల్‌పై రూ.1 సెస్ వేశామని వెల్లడించారు. ప్రజలకు ఏమీ గుర్తుండదని భాజపా నేతలు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. వారు అన్నీ గమనిస్తూనే ఉంటారని హెచ్చరించారు.

పెట్రోల్‌ ధరను రూ.116 వరకు ఎవరు తీసుకెళ్లారు?. పెట్రో ధరలు పెంచిన వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తారా?. ప్రజలకు ఏమీ గుర్తుండదని భాజపా నేతలు భావిస్తున్నారా?. రూ.2.87 లక్షల కోట్లను కేంద్రం వసూలు చేస్తోంది. కొన్ని నెలలుగా వీరబాదుడు బాది ఇప్పుడు రూ.5 తగ్గిస్తారా?. రూ.5, రూ.10 ఎందుకు.. లీటర్‌కు రూ.30 తగ్గించాలి. ఇక్కడి భాజపా నేతలు దిల్లీ నార్త్‌బ్లాక్‌ వద్దకు వెళ్లి ధర్నా చేయాలి. పెట్రో ధరలపై నార్త్‌బ్లాక్ వద్ద ధర్నా చేస్తే నేను కూడా వస్తా. పెంచిన పెట్రో ధరలు మొత్తం తగ్గించాలి. -పేర్ని నాని, రవాణాశాఖ మంత్రి

ధరల పెంపుపై భాజపా నేతలు ధర్నా చేయాలి...

రూ.2.87లక్షల కోట్లను పన్నుల రూపంలో కేంద్రం వసూలు చేస్తోందన్న మంత్రి...రూ.47వేల కోట్ల ఎక్సైజ్ పన్నునూ కేంద్రం వసూలు చేస్తోందని వివరించారు. చాలా రాష్ట్రాలు పన్ను ఎందుకు తగ్గించలేదో అడగాలని సూచించారు. రూ.70 ఉండాల్సిన పెట్రోల్ ధరను సెస్‌ల పేరుతో విపరీతంగా పెంచారని మంత్రి నాని... ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరిని 14 రాష్ట్రాలు గమనిస్తున్నాయన్నారు. రాష్ట్ర భాజపా నేతలు దిల్లీ నార్త్‌బ్లాక్‌(north black in delhi) వద్దకు వెళ్లి ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. పెట్రో ధరలపై నార్త్‌బ్లాక్ వద్ద ధర్నా చేస్తే తానూ వస్తానని స్పష్టం చేశారు. తెదేపా పాలనలో పెట్రోల్‌పై 31 శాతం పన్ను, ప్రత్యేక సర్ ఛార్జి విధించారన్న మంత్రి... తెదేపా ప్రభుత్వం చేసింది ఏమిటో చంద్రబాబు(TDP president chandrababu) తెలుసుకోవాలన్నారు. తెదేపా కార్యాలయంలో ఇచ్చిన స్క్రిప్ట్‌నే భాజపా నేతలు చదువుతున్నారని పేర్ని నాని ఆరోపించారు.

వైకాపా సంక్షేమ పథకాలు కనిపించడం లేదా..

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ సంక్షేమ పథకాలు(YCP government schemes) విపక్షాలకు కనిపించడం లేదా అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పేదల కోసం వెచ్చిస్తున్న వేల కోట్ల నిధులు కనిపించడం లేదా? అని అన్నారు. ఇంట్లో వాడే గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచి, మహిళల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. సిలిండర్ ధరపై పెట్రోలియంశాఖ మంత్రి వద్ద ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. వంట గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులపై తీవ్ర భారం పడుతోందన్నారు. రాష్ట్ర భాజపా నేతలకు చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్‌, డీజిల్‌, సిలిండర్‌ ధర తగ్గించాలని ధర్నా చేయాలని మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు.

తెదేపా పాలనలో పెట్రోల్‌పై 31 శాతం పన్ను, ప్రత్యేక సర్ ఛార్జి విధించారు. తెదేపా ప్రభుత్వం చేసింది ఏమిటో చంద్రబాబు తెలుసుకోవాలి. తెదేపా కార్యాలయంలో ఇచ్చిన స్క్రిప్ట్‌నే భాజపా నేతలు చదువుతున్నారు. వైకాపా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీకు కనిపించడం లేదా?. సిలిండర్‌ ధర పెంచి మహిళల ఉసురు పోసుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం మరో రూ.20 తగ్గించాలి. రాష్ట్ర భాజపా నేతలకు చిత్తశుద్ధి ఉంటే దిల్లీ వెళ్లి ధర్నా చేయాలి. -పేర్ని నాని, రవాణాశాఖ మంత్రి

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.