ETV Bharat / city

"జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో సచివాలయ వ్యవస్థ" - ఏపీలో సచివాలయాలు ప్రారంభం వార్తలు

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై సచివాలయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం  నిర్వహించారు. ఖాళీగా ఉన్న గ్రామ సచివాలయ పోస్టులను భర్తీ చేయాలని స్పష్టం చేశారు.

minister-peddireddy-review-on-secretariats

author img

By

Published : Dec 10, 2019, 3:37 AM IST

జనవరి 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని రాష్ట్ర పంచాయితీరాజ్‌, పురపాలక శాఖ మంత్రులు...... పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ తెలిపారు. సచివాలయంలో అధికారులతో సమావేశమైన ఇరువురు మంత్రులు... సచివాలయ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు.

"జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో సచివాలయ వ్యవస్థ"
ఖాళీల భర్తీకి ఆదేశాలు..
ఖాళీగా ఉన్న గ్రామ సచివాలయ పోస్టులను భర్తీ చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే లక్షా 10వేల పోస్టులను భర్తీ చేశామన్న మంత్రులు... ఇంకా 16 వేల 581 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. పశుసంవర్థకశాఖలో 6వేల 849 పోస్టులు, విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 1722, విలేజ్‌ సర్వేయర్ పోస్టులు 1246, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్- 6 పోస్ట్‌లు 1120 ఉన్నట్టు వివరించారు.

పక్కా భవనాలను నిర్మించండి
ఎఎన్​ఎం 983, మహిళా పోలీస్‌ పోస్టులు 899, వార్డు ప్లానింగ్ , రెగ్యులరైజేషన్‌ సెక్రటరీ పోస్టులు735, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు 615 ఖాళీగా ఉన్నట్లు మంత్రులు వెల్లడించారు. రాష్ట్ర స్థాయి కమిటీ ద్వారా స్పోర్ట్స్ కోటా పోస్టులను వెంటనే భర్తీచేయాలని సూచించారు. గ్రామ,వార్డు సచివాలయాలకు పక్కా భవనాలను నిర్మించాలని మంత్రులు ఆదేశించారు.

ఇదీ చదవండి : 'ఆ షరతులకు లోబడి ఉంటేనే... పోలవరానికి నిధులు'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.