రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పనుల్ని మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అందుబాటులో ఉన్న మెటీరియల్ను సద్వినియోగం చేసుకోవాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. బిల్లుల చెల్లింపుల్లో అలసత్వం వద్దని తేల్చి చెప్పారు. కొన్ని జిల్లాల్లో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని మంత్రి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్లస్థలాల చదును కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా కలెక్టర్లను సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2 వేల కోట్ల రూపాయల విలువైన మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,360 గ్రామ సచివాలయాల నిర్మాణానికి అనుమతి ఇచ్చామని వాటిలో 8,159 సచివాలయ పనులు ప్రారంభమయ్యాయన్నారు. సీసీ డ్రైన్ పనులు, నాడు-నేడు పనులు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పనులకు ఇసుక కొరత లేదన్నారు. అవసరమైన ఇసుకను మూడు శ్రేణుల ద్వారా సమీకరించేదుకు ఉత్తర్వులు జారీ చేసినట్టు మంత్రి వెల్లడించారు.
ఇదీ చదంవడి: అధికారులూ.. కడప జిల్లా అభివృద్ధిపై దృష్టిపెట్టండి: సీఎం జగన్