ఇప్పటివరకు 1700 మంది మత్స్యకారులను క్వారంటైన్ అనంతరం స్వస్థలాలకు పంపామని మంత్రి మోపిదేవి తెలిపారు. దూరప్రాంతాల వారిని తీసుకురావడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్న ఆయన.. వీరిని తరలించేందుకు సీఎం సహాయనిధి నుంచి రూ.3 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. 3,838 మంది మత్స్యకారులు 65 బస్సుల్లో మంగళవారం రాత్రి బయల్దేరారని.. రేపు సాయంత్రానికి వారు స్వస్థలాలకు చేరుతారని మంత్రి చెప్పారు. అయితే వైద్య పరీక్షలు చేసిన అనంతరమే వారిని స్వస్థలాలకు పంపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కరోనా లక్షణాలు లేకుంటే వారిని ఇళ్లకు పంపనున్నట్లు మోపిదేవి స్పష్టం చేశారు. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని కూలీలను స్వస్థలాలకు పంపుతామని మంత్రి వెల్లడించారు.
రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాం
రొయ్యలకు గిట్టుబాటు ధరలు కల్పించి కొనుగోలు చేయించినట్లు మంత్రి మోపిదేవి తెలిపారు. చేపలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు త్వరలో అధికారిక సమావేశం నిర్వహిస్తామన్న ఆయన.. ప్రభుత్వ పర్యవేక్షణలోనే కొనుగోలు జరిపేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి..